Milky Beauty Tamanna : మన సౌత్ ఇండియన్ సహా టాలీవుడ్ లో మంచి స్టార్డం ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. అయితే తమన్నా తన కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టి ఇప్పటికీ మంచి బిగ్ స్టార్ గా కొనసాగుతూ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుంది. మరి తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇన్నాళ్లు అయినా ఇంకా మిల్కీ బ్యూటీ కూడా పెళ్లి లేకుండా తన కెరీర్ పైనే దృష్టి సారించింది.
సో ఆమె వయసు కూడా ఎప్పుడో 30ని క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఫైనల్ గా ఇపుడు ఈమె పెళ్లి టాపిక్ వచ్చింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తమన్నా తన పెళ్లి అంశంపై ఓపెన్ అయ్యింది. అయితే ఇవి కాస్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనే చెప్పాలి. తాను ఏమని చెప్పింది అంటే ఇప్పుడప్పుడే ఇంకా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే తనకి లేదట.
దాదాపు ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే అని చెబుతుంది. అలాగే ఆ తర్వాత ఏం జరిగితే అదే జరుగుతుంది అని ప్రస్తుతం నా సినిమాల్లో చాలా బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. సో ఈ మిల్కీ బ్యూటీ అయితే ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి పీటలు ఎక్కేది లేదని చెప్పాలి. ప్రస్తుతం అయితే తమన్నా మెగాస్టార్ తో “భోళా శంకర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.