Thamanna: తొలిసారి మహిళా బౌన్సర్ గా మిల్క్ బ్యూటీ…. !

Thamanna: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తన అందాలతో అభినయంతో డాన్స్ తో కుర్రకారు మదిలో చెరగని ముద్ర వేసింది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు కానీ ఎక్కువ కాలం ప్రేక్షకులను అలరించేవారు చాలా కొద్దిమందే ఉంటారు అలాంటి వారిలో తమన్నా కూడా ఒకరు, ఒకవైపు ఎఫ్3 తో బిజీగా ఉంటూ మరోవైపు వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవే కాకుండా ఈ మధ్య వంటల షోకి హోస్ట్ గా కూడా వ్యవహరించింది.

తెలుగు తమిళ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. గతంలో బాలీవుడ్లో చేసినప్పటికీ ఆశించిన విజయం దక్కలేదు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో తన నటనా ప్రతిభను చూపించబోతోంది. ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ తన తరువాత చిత్రాన్ని తమన్నాతో “బబ్లీ బౌన్సర్ ” అనే సినిమాను చేయనున్నారు.ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

బబ్లీ బౌన్సర్ సినిమా షూటింగ్ బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందని మధు బండార్కర్ చెప్పారు.గతంలో తాను తెరకెక్కించిన సినిమాలకు భిన్నంగా బబ్లీ బౌన్సర్ ఉండనుందని, బాక్సర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. మిల్కీబ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఓ మహిళ బౌన్సర్ గా నటిస్తున్నారని, భారతదేశంలో తొలిసారిగా ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలిసినిమా ఇదే అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మధుర్ తెలిపారు.

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ మొదటిసారి బౌన్సర్ గా చేయడం చాలా సంతోషంగా ఉందని, చాలెంజింగ్ గా తీసుకుంటాం అని ఆమె చెప్పారు . ఈ సినిమాలో డీ గ్లామర్ గా నటించనుంది. మధుర్ బండార్కర్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. మరి ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.