‘మంచిరోజులొచ్చాయ్’తో మెహ్రీన్‌కి కొత్త సమస్య వచ్చిందా.?

అప్పటిదాకా బాగా బొద్దగా వున్నావ్, సన్నబడాల్సిందేనని అన్నారు చాలామంది మెహ్రీన్ కౌర్ పిర్జాదా విషయంలో. ఇప్పుడేమో కాస్త లావెక్కాలమ్మాయ్.. అంటున్నారు. పాపం, మెహ్రీన్ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి.?

‘మంచిరోజులొచ్చాయ్’ సినిమాతో మెహ్రీన్‌కి అదనంగా కలిసొచ్చిందేమీ లేదు. సినిమాలో ఆమె పాత్రకు అసలు ప్రాధాన్యత లేదంటూ చాలా రివ్యూల్లో తేల్చేశారు. దీపావళి సందర్భంగా విడుదలైన మారుతి సినిమా ‘మంచిరోజులొచ్చాయ్’కి మరీ అంత పాజిటివ్ టాక్ రాలేదు. నిజానికి, నెగెటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

అయినాగానీ, మారుతి మార్కు కామెడి, సినిమాని నిలబెట్టసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది కొందరి వాదన. కానీ, అలాంటి అద్భతమైన జరిగేలా కనిపించడంలేదు. ఇదిలా వుంటే, ‘మెహ్రీన్ మరీ బక్క చిక్కిపోయింది. ఇలాగైతే కష్టం.. కాస్త బొద్దుగా వుంటేనే బెటర్..’ అంటూ వస్తోన్న కామెంట్ల నేపథ్యంలో మళ్ళీ బరువు పెంచే పనిలో బిజీ అవబోతోందట మెహ్రీన్.

అన్నట్టు మెహ్రీన్, ‘ఎఫ్3’ సినిమాలోనూ నటిస్తోన్న విషయం విదితమే. ఇది కాక మరో రెండు సినిమాలున్నాయి ఆమె చేతిలో.