మెహ్రీన్‌కి ‘మంచి రోజులు’ వచ్చినట్లేనా.?

‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్, ఆ మధ్య పెళ్లి ప్రపోజల్స్‌తో చాలా అవకాశాల్ని వదులుకోవల్సి వచ్చిందట. అలా ఏరి కోరి వస్తున్న అవకాశాల్ని దృష్టిలో పెట్టుకునే ఫిక్స్ అయిన ఎంగేజ్‌మెంట్‌ని సైతం మెహ్రీన్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదన్న ఆంక్షల కారణంగా ముందుగానే కళ్లు తెరుచుకున్న మెహ్రీన్ నిశ్చితార్ధం రద్దు చేసుకుని పెళ్లికి గుడ్ బై చెప్పేసిందట. ఇకపోతే, ప్రస్తుతం మెహ్రీన్ కెరీర్‌లో బిజీ అయిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 4న రిలీజ్ కానుంది.

‘మహానుభావుడు’ సినిమాతో తనకు సూపర్ హిట్ ఇచ్చిన ‘మారుతి’ ఈ సినిమాకి దర్శకుడు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా టైటిల్ మాదిరిగానే తన పర్సనల్ లైఫ్‌లోనూ మంచి రోజులు వచ్చాయని ఈ సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా మెహ్రీన్ చెప్పుకొచ్చింది. మెహ్రీన్ మాటల్లోని అర్ధం.. ఆమె చేతిలో బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లేనా.? ఏమో చూడాలి మరి.