ప్రభాసూ.! అది వద్దు మహాప్రభో.!

సినిమా టైటిల్ వచ్చేసింది. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ గురించే ఇదంతా. ‘ అసలు ఈ సినిమా వద్దే వద్దు మహాప్రభో..’ అంటూ ప్రభాస్ అభిమానులు మొదటి నుంచీ మొరపెట్టుకుంటూనే వున్నారు.

ప్రభాస్ వింటే కదా.? ఏమో, మారుతిలో ఏం ప్రత్యేకతని ప్రభాస్ చూశాడో ఏమో.! లేకపోతే, ‘సలార్’, ‘కల్కి’, ‘స్పిరిట్’ వంటి ప్రాజెక్టులతో బిజీగా వున్న ప్రభాస్, మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటి.?

మారుతిని తక్కువ అంచనా వేయడం తగదు. కానీ, ప్రభాస్ మీటర్ సరిగ్గా లేదు ఈ మధ్యకాలంలో. అదే అసలు సమస్య. ‘సలార్’ కూడా అంతంతమాత్రమే అయ్యింది.! ఈ సమయంలో ‘ది రాజా సాబ్’ అనే చప్పటి టైటిల్‌తో అత్యంత సాధారణమైన పోస్టర్ బయటకు వస్తే, అభిమానులకు అనుమానాలు వుండవా మరి.?

మీ అంచనాలకు మించి వుంటుంది సినిమా.. అంటున్నాడు మారుతి. ప్రభాస్ అభిమానులు మాత్రం, వద్దు బాబోయ్.. అంటూనే వున్నారు. ఈ పంచాయితీ ఎప్పటికి తెగుతుందో ఏమో.! మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్.