సీనియర్ ఎన్టీఆర్ పై పోస్ట్ తో మెగా – నందమూరి ఫ్యాన్స్ కి షాకిచ్చిన మెగాస్టార్.!

Sr NTR

భారతదేశ చలన చిత్ర పరిశ్రమ దగ్గర తెలుగు సినిమాకి అంటూ ఎంతో మంది ఇప్పుడు గొప్ప పేరు తీసుకొచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇలాంటి స్థాయికి రావడానికి మన తెలుగు సినిమాని ఎప్పుడో పునాది వేసిన పలువురు ప్రముఖుల్ని అయితే ఎప్పటికి మర్చిపోకూడదు.

అలాంటి సీనియర్ స్టార్ నటులలో యుగ పురుషుడు నందమూరి తారక రామారావు కూడా ఒకరు. ఎన్టీఆర్ ఒక్క తెలుగు సినిమా కోసం అనే కాకుండా తెలుగు వారి కోసం కూడా చాలానే చేశారు. అది చరిత్రలో కూడా ఉంది. అయితే ఇలా ఎన్టీఆర్ తర్వాత మరికొందరు తెలుగు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టారు.

అయితే ఇలా తెలుగు సినిమా దగ్గర ఎంతో మంది వచ్చినా ఎన్టీఆర్ తర్వాతే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎన్టీఆర్ తర్వాత అంత స్థాయిలో ఒక వెలుగు వెలిగిన మరో స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మెగా స్టార్ చిరంజీవే అని చెప్పాలి.

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అని ఫ్యాన్ వార్స్ ఉంటాయి కానీ మెగాస్టార్ కి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ పై ఉండే అభిమానం కోసం తెలియంది కాదు మరి ఇప్పుడు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఒక కీలక పోస్ట్ పెట్టడం ఇతర నందమూరి అభిమానులకి ఆశ్చర్యకరంగా మారింది.

“తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!” అంటూ పోస్ట్ పెట్టారు దీనితో అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ కి ఒకేసారి మెగాస్టార్ షాక్ ఇచ్చాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.