హిందీ “ఆర్ఎక్స్ 100” ట్రైలర్ పై మెగాస్టార్ స్పందన.!

Megastar Reaction On Hindi Rx 100 Movie Trailer | Telugu Rajyam

లేటెస్ట్ ట్రెండ్ లో తెలుగు సినిమా బాగా మారిపోయింది. మన నుంచి ఎక్కువ రీమేక్స్ రావడం తగ్గి మళ్ళీ మన నుంచే అధికంగా రీమేక్ సినిమాలు బయటకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మన తెలుగు హిట్ సినిమాలని అయితే బాలీవుడ్ నిర్మాతలు అసలు వదలట్లేదు.

అలా మన దగ్గర భారీ హిట్ అయ్యిన “ఆర్ఎక్స్ 100” సినిమాని హిందీలో “తడప్” పేరుతో రీమేక్ చేశారు అక్కడి వాళ్ళు. అహాన్ హీరోగా తారా సుతారియా హీరోయిన్ గా మిలాన్ దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. అయితే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి తన స్పందనను తెలియజేసారు.

ఈ ట్రైలర్ చాలా రా గా ఇంటెన్స్ ఉందని అలాగే తనని ఇంప్రెస్ చేసింది అని మెగాస్టార్ తెలిపారు. అంతేకాకుండా చిత్ర యూనిట్ అంతటికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి చిరు విష్ చేశారు. ఈ ట్రైలర్ అయితే మన తెలుగు సినిమాకి సంబంధం లేకుండా అన్ని బాలీవుడ్ సినిమాల్లానే ఉంది మరి రిలీజ్ అయ్యాక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles