Mega star Chiranjeevi: మాఫియా డాన్ గా కనిపించనున్న మెగాస్టార్….!

Mega star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యారు మెగాస్టార్. ఈ సినిమాలో మాఫియా డాన్ గా కనిపించనున్నారు. చిరంజీవి క్యారెక్టర్ చాలా సరదాగా, ఎంటర్టైనింగ్ గా సాగిపోతుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంత పూర్తి చేశారట వెంకీ కుడుముల చిరంజీవి స్క్రిప్ట్ వర్క్ కి ఫిదా అయ్యారట.ఈ సినిమా కోసం టెక్నీషియన్స్, మిగతా యాక్టర్స్ ను సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు.

DVV దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2023 రెండవ భాగంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి అయింది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, ఇంకొక కీలక పాత్రలో రామ్ చరణ్ నక్సలైట్ గా నటిస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ కు హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ కొరటాల శివ కాగా సినిమాను వచ్చే ఏప్రిల్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

ఇక మెగా స్టార్ ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్,భోళా శంకర్ సినిమాల్లో నటించనున్నారు. ఇక బాబీ తీయబోతున్న ఒక సినిమా కూడా మెగా స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.ఈ విధంగా వరుస సినిమాలతో మెగాస్టార్ ఎంత బిజీగా ఉన్నారు ఇకపోతే ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.