మరో అభిమాని కోసం మెగాస్టార్ పెద్ద సాయం.!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒక్క సినిమా స్టార్ గానే కాకుండా గత రెండు దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిగా అందరికీ తెలుసు. రక్త దానం, నేత్ర దానం చేయమని ముందుండి నిలబడి తన కష్టార్జితంతో హాస్పిటల్స్ స్థాపించి ఎందరికో సాయం అందించారు. అందిస్తూ వస్తున్నారు. అయితే మెగాస్టార్ అందరితో పాటు తన అభిమానులు అన్నా ప్రాణం ఇస్తారు.

మరి అలాంటిది తన అభిమానుల ప్రాణం మీదకే వస్తే? తాను మళ్ళీ ముందుకొస్తారు. ఇప్పుడు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. వైజాగ్ కి చెందిన ఓ మెగాస్టార్ అభిమాని వెంకట్ అనే వ్యక్తి కాన్సర్ బారిన పడ్డాడు. దీనితో ఈ విషయాన్ని మెగాస్టార్ అఖిల భారత యువత సంఘం చిరు దృష్టికి తీసుకెళ్లగా మెగాస్టార్ పెద్ద సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

అతన్ని వెంటనే హైదరాబాద్ కి ప్రత్యేక చికిత్స కోసం షిఫ్ట్ చేయించి పూర్తిగా వైద్య ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. దీనితో మెగా అభిమానులు అంతా ఈ విషయం తెలిసాక మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ పలు భారీ సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.