భారీ యాక్షన్ సీన్ తో రీస్టార్ట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ఏంటో చెప్పక్కర్లేదు. అయితే మెగాస్టార్ రీసెంట్ గా నటించిన “ఆచార్య” తన కెరీర్ లోనే ఒక ఘోరమైన ప్లాప్ గా నిలిచింది. దీనితో ఈ చిత్రం అనంతరం చేస్తున్న సినిమాలు ఎలా ఉంటాయా అని అంతా అనుకుంటున్నారు. 

మరి వీటితో అయినా చిరు మంచి కం బ్యాక్ ఇస్తాడా అని అంతా చూస్తుండగా తాను మాత్రం గ్యాప్ లేకుండా రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న భారీ ఏక్షన్ చిత్రం “భోళా శంకర్” షూటింగ్ లో చిరు ఇప్పుడు జాయిన్ అయినట్టుగా మేకర్స్ తెలిపారు. 

అది కూడా ఓ భారీ ఏక్షన్ సీన్ తో షూటింగ్ ని మెగాస్టార్ రీస్టార్ట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దర్శకుడు మెహర్ అలాగే ఫైట్ మాస్టర్ లు రామ్ – లక్ష్మణ్ లతో ఈ చిత్రంలో ఈ సీన్ చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి సినిమాలో అయితే అదెలా ఉంటుందో చూడాల్సిందే. 

ఇక ఈ చిత్రాన్ని తమిళ హిట్ వేదాళం కి రీమేక్ గా చేస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది అలాగే కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.