Varun Tej: ఆ హీరోయిన్ తో ప్రేమలో పడిన మెగా హీరో.. త్వరలోనే పెళ్లి?

Varun Tej's Ganu facing several problems

Varun Tej: సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున పుకార్లు షికార్లు చేస్తుంటాయి అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇలాంటి పుకార్లు ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినపడుతున్నాయి. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరుణ్ తేజ్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంటుంది.ఈ విషయం పై నాగబాబు కూడా స్పందిస్తూ నిహారిక పెళ్లి అయిన వెంటనే వరుణ్ పెళ్లి చేస్తానని కూడా వెల్లడించారు.

ఈ క్రమంలోని నాగబాబు అమ్మాయిలను వెతికే పనిలో పడగా వరుణ్ తేజ్ మాత్రం ఒక హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.నేడు తన పుట్టిన రోజు కావడంతో ఏకంగా ఈ హీరో 25 లక్షల విలువ చేసే డైమండ్ ఉంగరంతో సదరు హీరోయిన్ కి ప్రపోస్ చేయడం కోసం వెళ్లారనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయం గురించి అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు లావణ్యత్రిపాఠి అని వార్తలు వినపడుతున్నాయి.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. అదేవిధంగా వరుణ్ తో కలిసి మిస్టర్ సినిమాల్లో కూడా నటించారు.ఇక తన సోదరి నిహారిక వివాహానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్క హీరోయిన్ కూడా హాజరు కాలేదు కానీ రీతువర్మ,లావణ్య త్రిపాటి మాత్రమే హాజరు అవడంతో ఈ ముద్దుగుమ్మ మెగా కోడలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో కథనాలు వినపడుతున్నాయి. అయితే వరుణ్ తేజ్ గురించి వస్తున్న ఇలాంటి వార్తలలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే వరుణ్ తేజ్ స్పందించాల్సి ఉంది.