Prabhas: ప్రభాస్ స్పిరిట్ సినిమాలో భాగం కానున్న మెగా హీరో…. ఆయన దశ తిరిగినట్టేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ త్వరలోనే రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2, సినిమాలు చేస్తున్నారు అలాగే అనురాగవపూడి డైరెక్షన్లో కూడా మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలతో పాటు యానిమల్ లాంటి సూపర్ హిట్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం బ్లాక్ చేశారు ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తుంది.

ఇక ఈ కథకు అనుగుణంగా నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలుపెట్టారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది ఇందులో మెగా హీరో కూడా భాగం కాబోతున్నారంటూ వార్త హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించడం కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ను తీసుకోవాలనే ఆలోచనలు సందీప్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో నటించడానికి వరుణ్ సైతం ఆత్రుత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి అవదులు ఉండవని చెప్పాలి. గత కొద్దిరోజులుగా వరుణ్ తేజ్ అనుకున్న స్థాయిలో సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇటీవల ఈయన నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ కు వెంటనే ఒక హిట్ కనకపడకపోతే ఈయన కెరియర్ ప్రమాదంలో పడుతుందని పలువురు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలోనే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే అసలు వదులుకోరని, ఈ సినిమా కనుక సక్సెస్ అయితే వరుణ్ కెరియర్ పరంగా నిలదొక్కుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.