‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో…
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ”మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌తో రంగ రంగ వైభవంగా సినిమా చేశాను. సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అన్ని సినిమాలు హిట్ అయినట్లే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నాను” అన్నారు.
హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ”టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా కూడా నచ్చుతుంది. సపోర్ట్ చేసిన టీమ్ మెంబర్స్ సహా అందరికీ థాంక్స్” అన్నారు.
చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ ”మా సినిమా ప్రతి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ సినిమా ఇక్కడకు వచ్చిందంటే ముఖ్య కారణం.. వైష్ణవ్ తేజ్‌గారే. ఓ హీరోను కలిసి కథ చెప్పటమంటే చాలా కష్టం. కానీ ఒక్క ఫోన్ కాల్‌తోనే ఆయన నన్ను కలిసి నా కథను విన్నారు. నేను తిరిగి వెళ్లే టప్పుడు ఆయన నాకు చాక్లెట్ బాక్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి నాకు వచ్చిన మొదటి గిఫ్ట్ అదే. నేనే కాదు.. మా ఫ్యామిలీ అంతా మెగాస్టార్‌చిరంజీవిగారి వీరాభిమానులం. దాంతో ఆరోజు రాత్రి మేం ఎవరం నిద్ర కూడా పోలేదు. మరచిపోలేని ఫీల్ ఇచ్చిన, గొప్ప అవకాశం ఇచ్చిన వైష్ణవ్ తేజ్‌కి థాంక్స్. పాటలు రిలీజ్ అయినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి వైష్ణవ్‌గారి లుఖ్ అదిరిపోయిందని, చించేశారని అన్నారు. నిజంగానే మా సినిమాలో వైష్ణవ్‌గారు కొత్తగా కనిపిస్తారు. ఆయన ఎనర్జీ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఆయన ఎనర్జీయే మా రంగ రంగ వైభవంగా సినిమా. మా సినిమాను చాలా హ్యాపీగా పూర్తి చేశామంటే నిర్మాత ప్రసాద్‌గారు, బాపినీడుగారే కారణం. మేం రాధ పాత్రకు చాలా మంది హీరోయిన్స్‌ని అనుకున్నాం. చాలా మందిని లుక్ టెస్ట్ చేశాం. ఓరోజు కేతికా శర్మను లుక్ చేసినప్పుడు ఆమె కళ్లు చూడగానే ఆమె నా రాధ అని ఫిక్స్ అయిపోయాను. తను అద్భుతంగా ఆ పాత్రను క్యారీ చేసింది. అందుకు థాంక్స్. దేవిశ్రీప్రసాద్‌గారితో ఓ సినిమా అయినా పని చేయాలని అనుకునేవాడిని. నా తొలి సినిమానే ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌గారు మంచి విజువల్స్ ఇచ్చారు. అవినాష్ కొల్లగారు మంచి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ వంటి అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్‌ను నవీన్ చంద్రగారు చేశారు. మా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్. ఈ సినిమా చూసిన తర్వాత నా సామి రంగా.. రంగ రంగ వైభవంగా అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు” అన్నారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ ”రంగ రంగ వైభవంగా’ మూవీలో చాలా మంచి పాత్ర చేశాను. అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా వైష్ణవ్, కేతికా శర్మ చాలా బాగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత అబ్బాయిలందరూ కేతికా శర్మతో లవ్‌లో పడతారు. మంచి సినిమా చేశాం. ఆదరించాలి” అన్నారు.
హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ ”’రంగ రంగ వైభవంగా’ మంచి ఫీల్ గుడ్ మూవీ. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది. మంచి టీమ్‌తో కలిసి వర్క్ చేశాను. ఈ సినిమాలో వైష్ణవ్ రిషి పాత్రలో నటిస్తే.. నేను రాధ అనే పాత్రలో నటించాను. మంచి పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ గిరిశౄయగారికి, నిర్మాతలు ప్రసాద్‌గారు, బాపినీడుగారికి థాంక్స్. వైష్ణవ్ నిజంగా డైనమిక్ పర్సన్. నవీన్ చంద్రకు నేను పెద్ద ఫ్యాన్. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను” అన్నారు.