అప్పట్లో చిరు, ఇప్పుడు పవన్ ఇద్దరు బాబుకు తెరుకోలేని దెబ్బకొట్టారుగా!!

Chandrababu and Pawan Kalyan showed cowardice

తెలుగు రాజకీయాల్లో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. మెగా కుటుంబ సభ్యులు ప్రజలకుసేవ చెయ్యడానికి ముందుకు వస్తున్నారు కానీ ప్రజలు మాత్రం వాళ్ళనుఆశయాలు పట్టించుకోవడం లేదు. అప్పుడు చిరంజీవికైనా కొంత గౌరవం దక్కిందేమో కానీ పవన్ మాత్రం 2019 ఎన్నికల్లో ఘోరమైన అవమానం జరిగింది. అయితే ఈ మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో రావడం ప్రజలకు ఎంత మంచిదో పక్కన పెడితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రంగా గండంగా మారింది. మెగా ఫ్యామిలీ వల్ల బాబుకు రాజకీయాల్లో ఘోరంగా దెబ్బతింటున్నారు.

Following Pawan's plans is dangerous to Chandrababu Naidu

అప్పుడు చిరు-ఇప్పుడు పవన్

2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యన ఉన్న పోటీలోకి ప్రజారాజ్యం పేరుతో మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఎన్నికలను ట్రై యాంగిల్ చేశారు. ఈ ట్రై యాంగిల్ ఎన్నికల వల్ల అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచే జరిగింది కానీ ఇప్పుడు బాబుకు మాత్రం జీవిత కాల నష్టం జరిగింది. అప్పుడు చిరు ఎన్నికల్లో పోటీ చెయ్యడం వల్ల బాబుకు అనుకూలంగా ఉన్న కాపు ఓట్లన్నీ చిరుకు వెళ్లడంతో బాబుకు ఓటమి పాలు అయ్యారు. అలాగే ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా బాబుకు మెగా ఫ్యామిలీ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. జనసేన పార్టీ తరపున పవన్ గెలిచింది ఒక్క సీట్ మాత్రమే కావచ్చు కానీ టీడీపీని మాత్రం గెల్వకుండా చేశారు. ఇలా మెగా ఫ్యామిలీ వల్ల బాబుకు నష్టం జరుగుతూనే ఉంది.

స్థానిక ఎన్నికల్లో కూడా బాబుకు మెగా గండం

ఇప్పుడు జ‌రిగే ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ అదే దెబ్బ చంద్రబాబుకు త‌గిలే ఛాన్సులు ఉన్నాయి. పైగా ఈ సారి ప‌వ‌న్‌కు తోడు బీజేపీ కూడా ఉంది. హిందువులు, ఆర్ఎస్ఎస్ సానుభూతిప‌రుల్లో కొంద‌రి ఓట్లు అయినా ఈ కూట‌మికి ప‌డితే మ‌ళ్లీ చంద్రబాబుకు గ‌ట్టి దెబ్బ త‌ప్పేలా లేదు. ముఖ్యంగా ప‌వ‌న్ సొంత జిల్లా అయిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో డెల్టాలో మూడు, నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన కూట‌మి ప్రభావం ఎక్కువుగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనే టీడీపీ జ‌న‌సేన దెబ్బతో న‌ర‌సాపురం, భీమ‌వ‌రంలో మూడో స్థానంలో ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లో బాబుకు పవన్ ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాలి.