మెగా వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక పెళ్లి వేడుకకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెళ్లి కి కేవలం మరో ఆరు రోజులు వుండటంతో అప్పుడే మెగా ఫ్యామిలీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని ప్రారంభించేసింది.
ఈ సందర్భంలో నిహారిక ఇంస్టాగ్రామ్ లో కాబోయే భర్త తో ఉన్న ఫోటో ను షేర్ చేస్తూ .. మేము ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించాము అంటూ పోస్ట్ చేసింది. ఆ అద్భుత క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.
గుంటూరుకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రరావు తనయుడు జొన్రలగడ్డ చైతన్యతో కొణిదెల నిహారిక వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. బుధవారం బయటికి వచ్చిన నిహారిక వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మెగా ఫ్యామిలీస్ ఒక్కొక్కరుగా ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ కు చేరుకుంటున్నాయి. ఇండప్ట్రీ నుంచి చాలా తక్కువ మందికి ఆహ్వానాలు అందాయి. పెళ్లి తరువాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ని ప్లాన్ చేస్తున్నారు