మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోని కాదు దేశంలో పరిచయం అక్కరలేని పేరు. ఆయన సినిమాలో అధిరోహించిన శిఖరాలు సాధారణ మానవుడికి సాధ్యమయ్యేవి కాదు. ఒక జనరేషన్ సినీ అభిమానులు ఆయనను ఒక దేవుడిగా చూశారు. సినిమాల్లో ఎదురులేని కథానాయకుడిగా ఉన్న చిరు రాజకీయ ప్రవేశం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రిని కోరుకున్నారు. అయితే చిరుకు ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 18 స్థానాలోనే గెలిచారు. తరువాత కొన్ని రోజులకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తరువాత కొన్ని రోజులకు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేనను స్థాపించి, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు.
ఎన్నికల తరువాత కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మెగా బ్రదర్స్ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్తారే కానీ వారికి నిజంగా చిత్తశుద్ధి లేదని రాజకీయ పండితులు చెప్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే సీఎం కుర్చీని కోరుకుంటున్నారు. ఓడిపోవడం వల్ల వెనుదిరుగుతున్నారని చెప్తున్నారు. మెగా బ్రదర్స్ కు రాజకీయాల్లో ఓపికతో నిలబడే ధైర్యం లేదని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నారనే వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అన్యాయాన్ని ఎదురించాలనే తపన , పోరాడే తత్వం, వెంట నడవగలిగే సైన్యం, ప్రజల సమస్యలపై అవగాహన ఇవన్నీ ఉన్నా కూడా ఓపిగ్గా నిలబడే తత్వ లేకపోవడం వల్లే మెగా బ్రదర్స్ఫైల్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సీఎం సీటు కోసం ఆశపడే మెగా బ్రదర్స్, ప్రజల కోసం తమ అసహనాన్ని త్యాగం చేయలేకపోతున్నారు.