మెగా – అక్కినేని యంగ్ కాంబో: ఆన్ ది వే.?

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలుగా మాత్రమే కాదు, వీరిద్దరూ బిజినెస్ పాట్నర్స్ కూడా. అక్కినేని హీరోల సినిమాలను మెగా ఫ్యామిలీ హీరోలు ఎప్పటికప్పుడే సపోర్ట్ చేస్తుంటారు కూడా. గతంలో అక్కినేని అఖిల్, చైతూ సినిమా ఫంక్షన్‌లకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన సందర్భాలు అనేకం.

తాజాగా చైతూ నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాకి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి రావడం వల్లే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.. అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అభివర్ణించారు కూడా.

అది సరే, లేటెస్టుగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బుల్లితెర మెగా రియాల్టీ షో బిగ్‌బాస్‌కి చరణ్ అతిథిగా విచ్చేశాడు. ‘మా అన్నయ్య కొడుకు చరణ్’ అంటూ చరణ్‌ని ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడీ స్టేజ్ మీద నాగార్జున. ఇకపోతే, ఈ అనుబంధం ఇప్పుడు ఆన్ స్ర్కీన్ బంధంగా మారే ఛాన్స్ వచ్చింది కాబోలు.

అన్నపూర్ణ బ్యానర్‌లో సూపర్ హిట్ ఇచ్చిన ఓ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – అక్కినేని నాగ చైతన్య కాంబో కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారట. సంక్రాంతికి ఈ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.