వైరల్ : అనుష్క హాట్ ఎంట్రీకి అదిరిపోయిన థియేటర్ రెస్పాన్స్..!

తెలుగు సినిమా దగ్గర అయితే ఎంత మంది స్టార్ హీరోయిన్ లు ఉన్నా కూడా కొందరి మార్క్ మాత్రం చెరగని విధంగా ఉంటుంది. మరి అలాంటి అతి కొద్ది మందిలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి అలాంటి అనుష్క తన కెరీర్ లో చేసిన ఎన్నో ఐకానిక్ రోల్స్ లో మాంచి హాట్ రోల్స్ కూడా ఉన్నాయి.

మరి అలా తన అందాలతో విందు పెట్టిన చిత్రం “బిల్లా”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన చిత్రాల్లో ఇది ఒకటి కాగా ప్రభాస్ మరియు హీరోయిన్ అనుష్క ల కాంబినేషన్ అంటే పిచ్చ క్రేజ్ వచ్చిన చిత్రమ్ కూడా ఇదే. మరి అప్పట్లోనే సినిమా లో అనుష్క ట్రీట్ చూసి అంతా షాక్ అవ్వగా..

ఇప్పుడు మళ్ళీ అనుష్క తన హాట్ ఎంట్రీ తో థియేటర్లు ని షేక్ చేసింది. తాజాగా ప్రభాస్ బర్త్ డే కానుకగా అయితే బిల్లా 4కే వెర్షన్ ని రీ రిలీజ్ చెయ్యగా ఇందులో ఇప్పుడు అనుష్క పూల్ లో హాట్ ఎంట్రీ సీన్ విజువల్స్ థియేటర్స్ లో దుమ్ము లేపేస్తున్నాయి.

దీనితో ఈమె ఎంట్రీ సీన్ సోషల్ మీడియాలో గట్టి వైరల్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం అయితే అనుష్క ఓ సినిమా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో చేస్తుంది. దీని తర్వాత ఓటిటి లో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.