టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రవితేజ మార్కెట్ కు ఈ మొత్తం ఎక్కువైనా రవితేజ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతూ ఉండటంతో పాటు నిర్మాతకు నష్టం వస్తే రవితేజ కొంతమేర ఆదుకుంటూ ఉండటంతో రవితేజతో సినిమాలను నిర్మించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఊహించని రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న ఈ హీరో కెరీర్ తొలినాళ్లలో మాత్రం చాలా తక్కువ మొత్తం పారితోషికంగా అందుకున్నారు. రవితేజ తొలి సినిమా రెమ్యునరేషన్ కేవలం 400 రూపాయలు కావడం గమనార్హం. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన నటుడు కావడంతో ఈ మొత్తం రవితేజకు పారితోషికంగా దక్కింది. కన్నడలో తెరకెక్కిన అభిమన్యు రవితేజ నటించిన తొలి సినిమా కావడం గమనార్హం.
రవితేజ హీరోగా తెరకెక్కిన తొలి సినిమా నీకోసం కాగా ఈ సినిమాకు రవితేజ పారితోషికం 20,000 రూపాయల కంటే తక్కువని సమాచారం. పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు రవితేజను స్టార్ హీరోగా మార్చాయి. ప్రస్తుతం యంగ్ జనరేషన్ డైరెక్టర్ల డైరెక్షన్ లో రవితేజ ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం. క్రాక్ సినిమాకు రవితేజ 12 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ అందుకున్నారు.
ఏడాదిన్నరలోనే రవితేజ రెమ్యునరేషన్ 8 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను ఈ మధ్య కాలంలో పెంచిన మరో హీరో అయితే లేరనే చెప్పాలి. హిట్లు సాధిస్తే రవితేజపై రెమ్యునరేషన్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వరుసగా ఫ్లాప్స్ వస్తే మాత్రం రవితేజ కెరీర్ పై ప్రభావం పడటం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.