ఎప్పటి నుండో ఓ సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు హీరో గోపీచంద్. ‘సీటీమార్’తో సూపర్ హిట్ కొడతాడనుకున్నారంతా. కానీ, రిలీజ్‌కి ముందు క్రియేట్ అయిన బజ్, రిలీజ్ తర్వాత తుస్‌మనిపోయింది ఆ సినిమా విషయంలో. అంతకు ముందూ బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్ నుంచి చాలా సినిమాలొచ్చాయి. కానీ, అన్నీ నిరాశపరిచాయి.
ఇక నెక్స్‌ట్, మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అంటూ మాంచి జోష్‌తో వస్తున్నాడు గోపీచంద్. అయితే, ఈ సినిమా అయినా గోపీచంద్‌కి బ్రేక్ ఇస్తుందా.? మరో వైపు, మారుతి మూస కథలతో బోర్ కొట్టించేస్తున్నాడు. మారుతి సినిమా అంటే ఏదో ఒక రోగమే గుర్తొస్తోంది ఆడియన్స్‌కి.
మొదట్లో హీరోకి లోపం పెట్టాడు. తొలి సినిమాకి హిట్ కొట్టాడు బాగానే ఉంది. మలి సినిమానీ భరించేశారు. కానీ, తర్వాత నుంచి పెదవి విరిచేస్తున్నారు ప్రేక్షకులు. లేటెస్టుగా మారుతి నుంచి వచ్చిన ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాలోనూ హీరోయిన్ తండ్రికి ‘భయం’ రోగం పెట్టేశాడు. ఇక గోపీచంద్ సినిమాకి ఏం మాయ రోగం పెడతాడో అని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి.