Director Maruthi: సినిమాలలోకి రాకముందు మారుతి అలాంటి పనులు చేసేవారా… కల నెరవేరిందంటూ ఎమోషనల్?

Director Maruthi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో డైరెక్టర్ మారుతి ఒకరు.ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఈయన కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా చిన్న హీరోలతో సినిమాలు చేసే స్థాయి నుంచి నేడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా చేసే స్థాయికి మారుతి ఎదిగారని చెప్పాలి. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల సమయానికి ముందుగా డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.దర్శకుడిగా తన ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు తన తండ్రి అరటిపళ్లు అమ్మిన ప్రాంతంలో ఇప్పుడు తన కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.మచిలీపట్నం.. సిరి కాంప్లెక్స్ (గతంలో దాని పేరు కృష్ణ కిషోర్ కాంప్లెక్స్) ఒకప్పుడు అక్కడే మా నాన్న చిన్న దుకాణం పెట్టుకుని అరటిపళ్లు అమ్మేవారు.

సినిమాలలోకి రావాలన్న ఉద్దేశంతో నేను ఈ థియేటర్లో విడుదల అయ్యే సినిమా హీరోల అందరికీ బ్యానర్లు నేనే రెడీ చేసేవాడిని. ఒక్కసారైనా అక్కడ నా పేరు చూడాలి అని కలలు కన్నవారిలో నేను ఒకడిని. ఇప్పుడు అదే కాంప్లెక్స్ వద్ద నిల్చొని నా ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకుంటే జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు మించి ఏం కావాలి ? ఈరోజు మా నాన్న ఉండుంటే ఎంతో గర్వపడేవారు. ఆయనను నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా థియేటర్ ముందు అరటి పండ్లు అమ్మేస్తాయి నుంచి థియేటర్ పై కటౌట్ పడేస్తాయి వరకు మారుతి ఎదిగారని చెప్పాలి.