Crime News: రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. ఆ క్రైమ్ ఒక్కొక్కరు ఒక్క లాగా చేస్తూ పోలీసులకి సవాలు విసురుతున్నారు. పాత కక్షలు, కుటుంబ సమస్యలు, చిన్న చిన్న గొడవల వల్ల ఇలాంటి దారుణాలు ఎన్నో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి.
సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేస్తున్నట్టుగా అనిపిస్తాయి వీరు చేసే పనులు. వీరు చేసే క్రైమ్ సినిమాలలో పెడతారా లేక సినిమాలు చూసి క్రైమ్ చేస్తారా అనే లాగా చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడు రాజధాని చెన్నై లో జరిగింది.
చెన్నై లోని తిరుపుర్ లో ఒక ప్రతినిత్యం రద్దీగా ఉండే రహదారిలో ప్రతి రోజూ వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అక్కడి స్థానికులు రోడ్డు పక్కన కాలువలో తేలియాడుతూ ఉన్న సూట్కేసును గమనించారు. చాలా మంది ఆ సూట్ కేస్ నీ గమనించినప్పటికీ ఆ విషయం గురించి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ కొంతమంది స్థానికులు అందులో బాంబ్ ఏమైనా ఉందా అనే డౌట్ వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ సూట్ కేస్ ను స్వాధీనం చేసుకున్నారు. వారు కూడా అందులో ఏముందో అని మెల్లగ ఆ సూట్ కేస్ ను ఓపెన్ చేసి చూడగానే అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. అందులో ఒక మహిళ మృతదేహం ఉంది. ఇది తిరుప్పూర్ నుంచి ధారాపూర్ వెళ్తున్న రోడ్ కి పక్కన ఉన్న కాలవలో పడిన సూట్ కేస్ లో మహిళల మృతదేహం లభ్యమైంది. ఇది ఎవరైనా ఆమెని చంపేసి సూట్ కేస్ లో పెట్టి ఇక్కడ పడేసారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన మహిళ దాదాపు వయసు 30 సంవత్సరాలు ఉండవచ్చు అని, ఆమె ఎవరు అనే దాని మీద విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. తిరుప్పూర్ నుండి ధారాపూర్ మధ్య గల రోడ్ మీద ఉన్న సీసీటీవీ లలో ఉన్న ఫుటేజ్ లను చెక్ చేస్తున్నాము అని పోలీసులు తెలిపారు.