Subhalekha Sudhakar: యాక్టర్ అవుదామని వచ్చిన మనో.. సింగర్ ఎలా అయ్యారో చెప్పేసిన శుభలేఖ సుధాకర్!

Subhalekha Sudhakar: ప్రస్తుత రోజుల్లో హాస్యం అనేది అపహాస్యం అవుతోందని సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. మొదటి సారి ఓకే గానీ, మళ్లీ అదే కామెడీ అంటే చిరాకు పుడుతుందని ఆయన చెప్పారు. ఎంతో మంది కమెడియన్లు వచ్చారు.. వస్తున్నారు. అందులో ముఖ్యంగా చార్లీ చాప్లిన్ చేసే కామెడీని చూస్తే అర్థం అవుతుంది. ఓవర్‌గా ఉండదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుందని ఆయన తెలిపారు.

అదే ఈ రోజుల్లో చూసుకుంటే అది ఓవర్ అయిపోతుందని సుధాకర్ అన్నారు. ఎవరో ఒక వ్యక్తి మీద జరిగే హింసను ఆనందిస్తున్నారు అంటే అసలు మానవత్వం ఎక్కడుంటుంది? మానవత్వం చచ్చిపోతుంది అని, ఒక మనిషిగా ఉంటే ఎవరైనా గుర్తిస్తారు అని ఆయన చెప్పారు. మనిషి అంటేనే మానవత్వమున్న రుషి అని అర్థం. మానవత్వం పోయింది, రుషి పోయింది. చివరికి మనీ మిగిలింది అని ఆయన వేదాంతం చెప్పారు.

తాను ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డానని, చాలా మంది చేతిలో మోసపోయానని శుభలేఖ సుధాకర్ అన్నారు. అందుకే ఎవరికైనా ఆ స్టేజ్‌లో ఉన్నారని తన దగ్గరికొస్తే కచ్చితంగా స్పందిస్తానని ఆయన చెప్పారు. ఎవరైనా తనను మోసం చేశారు అంటే ఆ వ్యక్తి తనను కోల్పోతున్నాడు అని, తాను అతన్ని కోల్పోతున్నట్టు కాదు అని కొత్త అర్థం చెప్పారు సుధాకర్.

ఇకపోతే చాలా మంది ఒకేసారి యాక్టర్ అవుదామని వచ్చి ఓకే రూంలో కూడా ఉన్నామని ఆయన చెప్పారు. అదే సమయంలో సింగర్ మనో కూడా ఇండస్ట్రీకి వచ్చారని ఆయన అన్నారు. మనో కూడా ముందు నటుడు కావాలనే వచ్చారని, కానీ ఆయనకు సంగీతం మీదున్న మక్కువతో హార్మోనియం వాయించడం అలా స్టార్ట్ చేసి, సింగర్‌గా ఎదిగారని శుభలేఖ సుధాకర్ స్పష్టం చేశారు.