మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత ( మహారాజా అలోక్ నారాయణ ఆఫ్ ఆర్స్ట్ అండ్ సైన్సెస్) సంచలన ఆరోపణలు చేసారు. తన తండ్రి చితి ఆరకముందే చంద్రబాబు నాయుడు తన బాబాయి అయిన అశోక్ గజపతిరాజుకు మాన్సాస్ ట్రస్టుని కట్టబెట్టారని ట్విటర్ వేదిగా ఆరోపించారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి చంద్రబాబు ఇష్టాను సారం జీవోని జారీ చేసారన్నారు. అందులో చంద్రబాబు ఎంత వాటా ఎంతో? చెప్పాలని నిలదీశారు. చైర్మన్ గా అశోక్ గజపతి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగా ట్రస్ట్ ఆర్ధికంగా నష్టపోయిందన్నారు.
ఆనంద గజపతిరాజు గారి పెద్ద బిడ్డగా, ఆయన వారసురాలిగా నష్టపోయిన మాన్సాస్ బాధ్యతల్ని తీసుకుని చక్కదిద్దుతున్నాను అన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. బాబాయి చర్యల కారణంగా విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయిందని ఆరోపించారు. ట్రస్టు భూమి కబ్జాలకు గురవుతుంటే కేసులు వాదించడానికి చంద్రబాబు కనీసం లాయర్ ని కూడా నియమించలేదని దుయ్యబెట్టారు. విశాఖ అడిషనల్ జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పు అందుకు ఉదాహరణ అని అన్నారు. ఆస్తులు దోచేయడంలో చంద్రబాబుది అంద వేసిన చేయి అని ఆరోపించారు. మాన్సాస్ లా కాలేజీ క్యాంపస్ ను ఐఎల్ ఎఫ్ ఎస్ కు ఉచితంగా ఇవ్వడాన్ని ఆమె తప్పు బట్టారు.
అది ఎంత పెద్ద కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయస్థాయిలో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. చంద్రబాబు తన సహచరుడ్ని పొగిడే ముందు మా తాతగారు, తండ్రిగారి వారసత్వాన్ని ఆయన ఏ విధంగా ధ్వంసం చేసారా? తెలసుకోవాలని మండిపడ్డారు. ఇవన్నీ మీ ఇద్దరు కలిసి చేసినవేనా అంటూ చంద్రబాబు, అశోక్ గజపతిరాజుపై అనుమానం వ్యక్తం చేసారు. సంచయిత చేసిన ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు-అశోక్ గజపతిరాజు రాకీయాలపై అన్ని పార్టీల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇప్పటికే చంద్రబాబు అరచకాల చిట్టా బయడ పడిన నేపథ్యంలో సంచయిత ఆరోపణల్ని బాబు గారిని మరింత ఇబ్బందులు గురిచేయడం ఖాయమంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.