Actress Sudha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా నటి సుధ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తనకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు చిన్నప్పటి నుంచి బాగా తెలుసని, కొందరు హీరోలు తనని ఎంతో ప్రేమగా అమ్మ అంటూ పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.
వారి సినిమాలలో నేను వారికి తల్లి పాత్రలో నటించడం వల్ల ఇప్పటికి అదే ప్రేమతో నన్ను అమ్మ అని పిలుస్తారని సుధ తెలియజేశారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా నటుడు మంచు మనోజ్ గురించి సుధ ఆశక్తికరమైన విషయం బయట పెట్టారు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ బాలనటుడిగా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మనోజ్ కు తన తల్లి అన్నం తినిపిస్తే అన్నం తినడానికి ఎంతో మారాం చేసేవాడు.
ఇలా మారాం చేయటం వల్ల తన తల్లి తనని కొట్టేవారని అప్పుడు మనోజ్ ఏడుస్తూ..వాళ్ళమ్మ తనకు నచ్చలేదని ఏడుస్తూ తన దగ్గరికి వచ్చేవాడని ఈ సందర్భంగా మనోజ్ గురించి సుధా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమా గురించి మాట్లాడుతూ… ఆ సినిమా తన లైఫ్ నే మార్చిందని,ఆ సినిమాని మిస్ చేసుకొని ఉంటే నేను ఎంతో బాధపడేదాన్ని అని ఈ సందర్భంగా సుధ తెలియజేశారు.