Singer Sunitha: వివాదంలో సింగర్ సునీత భర్త రామ్.. బహిరంగంగా క్షమాపణలు రామ్!

Singer Sunitha: తెలుగు ప్రేక్షకులకు సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు హీరోయిన్లతో సమానంగా గుర్తింపు క్రేజ్ సంపాదించుకుంది. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా లక్షలాది మంది అభిమానం సంపాదించుకుంది.చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత తర్వాత వీడిపోయి సింగల్ మదర్ గా ఇటు సింగర్ గా రాణించారు. ఇటీవల మాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ఇద్దరు వారి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

సునీత భర్త రామ్ మాంగో మ్యూజిక్ ఓనర్ ఆయన్ను డిజిటల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో మొఘల్ తో పోలుస్తారు. అయితే రామ్ ఆఫీసియల్ యూట్యూబ్ ఛానల్ ఇపుడు వివాదంలో చిక్కుకుంది.రామ్ యూట్యూబ్ ఛానల్ లోని కొన్ని వీడియోలు గౌడ మహిళలను వేశ్యలుగా చూపించి గౌడ మహిళలను కించపరిచారని సంబంధిత వర్గాలు రామ్ ఆఫీస్ పై దాడి చేసారు.

దీంతో వెంటనే రామ్ వారికీ క్షమాపణలు చెప్పి సదరు వీడియోలను యూట్యూబ్ ఆఫీషియల్ సైట్ నుండి తొలగించారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే సునీత పెళ్ళైన తర్వాత ఇంకా ఆక్టివ్ గా నేచర్ కు సంబంధించిన పిక్ లను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఇపుడు ఈ వివాదం పై ఎలా స్పందిస్తోంది వేచి చూడాలి. కాగా సునీత ఈటీవీ పాడుతాతీయగా ప్రోగ్రాంకు హోస్ట్ గా త్వరలో రానుంది.