మంచు విష్ణు సంచలన నిర్ణయం

మంచు విష్ణు నటించిన కొత్త సినిమా ‘జిన్నా’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా మీమర్స్, యూట్యూబర్స్ తో విష్ణు ఒక మీటింగ్ అరేంజ్ చేసారు విష్ణు. మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలిపారు విష్ణు. త‌న కుటుంబంపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై విష్ణు మంచు స్పందించారు. ట్రోలింగ్ ఒక లెవెల్ వరకు ఉంటె పర్లేదు కానీ, కొన్ని సార్లు హద్దులు దాటితేనే ఎవరికైనా ఇబ్బంది అన్నారు.

అలాగే, టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో త‌న‌ను, త‌న కుటుంబాన్ని టార్గెట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. స‌ద‌రు హీరో జూబ్లిహిల్స్‌లోని తన ఐటీ కంపెనీలో త‌న కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నార‌ని విష్ణు ఆరోపించారు. త్వరలో దీని పై పోలీస్ కేసు పెడతానని హెచ్చరించారు.

తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైన విష్ణు, ఇకపై ఎలాంటి ఎలక్షన్స్ లో పాల్గొనబోనని చెప్పారు. తాను సినిమాలు చేసుకుంటూ పోతానని, రాజకీయాలు కి దూరంగా ఉంటానని విష్ణు చెప్పారు.

సూర్య దర్శకత్వం లో వస్తున్నా ‘జిన్నా’ సినిమా అక్టోబర్ 21  న రిలీజ్ కి రెడీ గా ఉంది. సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, సునీల్, నరేష్, సురేష్, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.