“ఆదిపురుష్” విషయంలో మంచు విష్ణు చేసిన కామెంట్ ప్రతిదీ నిజం.!

టాలీవుడ్ లో సెపరేట్ గా రియాలిటీ కి కాస్త దూరంగా తమకంటూ వేరే ప్రపంచంలో ఉండే కుటుంబం మంచు వారి కుటుంబం. అయితే ఎన్ని ట్రోల్స్ అవి ఇవి వీరి మీద ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం చాలా మందికి వీరిపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అలాగే చాలా విషయాల్లో అయితే ఏదైనా కూడా ముక్కు సూటిగా బెరుకు లేకుండానే చెప్తారు.

మరి అలా లేటెస్ట్ గా మంచు విష్ణు పాన్ ఇండియా సినిమా ప్రభాస్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ “ఆదిపురుష్” పై కొన్ని కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే తాను మాట్లాడుతూ చిత్ర యూనిట్ ముందు సినిమా ఒక లైవ్ యాక్షన్ సినిమాగా తీస్తున్నామని తెలిపారు కానీ టీజర్ చూస్తే ఇదేదో యానిమేషన్ సినిమాలా ఉందని అనిపించింది.

అందుకే ఇన్ని ట్రోల్స్ వచ్చాయని తాను అన్నాడు. అయితే తాను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఏ ఒక్క మాట కూడా అబద్దం కాదు. నిజానికి తనలా ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరి మదిలో మాట కూడా ఇదే.

చిత్ర యూనిట్ ముందు అవతార్ రేంజ్ లో లైవ్ ఏక్షన్ సినిమానే ఇది అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే యానిమేషన్ చూపించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం మంచు విష్ణు మాటలు ప్రతి ఒక్కరూ ఏకీభవించక తప్పదు తన మాటల్లో ఎలాంటి తప్పు కూడా లేదు.