ప్రభాస్ ని దాటిపోయిన మంచు విష్ణు

హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుండి టీజర్ విడుదలయ్యింది. కానీ ఆ టీజర్ కార్టూన్ షో లా ఉందని అలాగే, రాముడు, రావణుడు, హనుమంతుడు గెట్ అప్ లు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని చాలా విమర్శలొచ్చాయి. కానీ ఆ టీజర్ మాత్రం మొదటి స్థానంలో ట్రెండ్ అయ్యింది.

తాజాగా మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ నుండి వచ్చిన ట్రైలర్ ప్రభాస్ ఆదిపురుష్ ని వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానంలో కొంతసేపు కొనసాగింది. ఇషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లో సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హెరొఇనెస్ గా నటిస్తున్నారు.

దీపావళి కానుకగా ‘జిన్నా’ సినిమాని అక్టోబర్ 21  న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. ‘చంద్రముఖి’ సినిమా తరహాలో హారర్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ మీద ఇప్పటికి మంచి అంచనాలే ఉన్నాయి. చూడాలి మంచు విష్ణు ఈ సారైనా హిట్ కొడతాడా లేదో.