మంచు విష్ణు సాధారణంగా మూవీ పార్టీలు, ఫంక్షన్స్ కి దూరంగా ఉంటాడు. తన పనేదో తాను చేసుకుంటూ వెల్తూ ఉంటాడు. అందరితో కలిసే మెలిగే విష్ణు కి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇద్దరి మధ్య మంచి ఫ్రెంఢ్సిప్ కూడా ఉంది. నిన్న ప్రభాస్ 43 వ పుట్టినరోజు చేసుకున్నాడు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులను సెలబ్రెటీలు ఆయనకు పెద్దఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే హీరో మంచువిష్ణు కూడా ప్రభాస్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో మంచు విష్ణు తన పోస్ట్ లో…మరోతల్లికి పుట్టిన నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే పుట్టినరోజుకు అతడు పెళ్లి చేసుకుంటాడో లేదో కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే ఇస్తాడు. నా ప్రేమాభిమానాలు నీకెప్పుడూ ఉంటాయి డార్లింగ్ ప్రభాస్ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేసాడు.
మంచు విష్ణు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో ప్రభాస్ అభిమానులు కొంతమంది థాంక్స్ చెబుతుంటే మరికొందరు మాత్రం విష్ణు పై ఫైర్ అవుతున్నారు. తిన్నగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఎక్స్ట్రాలు అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.