టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఒకటి. మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ హీరోలుగా ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో మంచి సినిమాలు చేసి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్న ఈ ఇద్దరూ గత కొన్నేళ్లుగా బాగా వెనుకబడ్డారు. కథలను ఎంచుకోవడంలో తడబడుతున్నారు. ఏడాదికి చేసే ఆ ఒక్క సినిమా కూడ డిజాస్టర్ అవుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత మంచి విష్ణు నుండి చేసిన ‘మోసగాళ్లు’ ఈ నెల 19న రిలీజ్ కానుంది. తెలుగు దర్శకులను వదిలిపెట్టి హాలీవుడ్ దర్శకుడ్ని పట్టుకొచ్చి సినిమా చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా రూపొందింది. టీజర్, ట్రైలర్ మామూలుగానే ఉన్నాయి. ఎక్కడా ఆహా ఓహో అనే ఫీల్ లేదు. కానీ విష్ణు మాత్రం సినిమా తప్పకుండా హిట్ అంటున్నారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమా అని నమ్మకంగా చెబుతున్నారు.
బజ్ పరంగా చూసినా ఏమంత క్రేజ్ లేదు. ఆయన గత సినిమాలు నాలుగైదు ఇలాంటి మాటల మధ్యనే వచ్చి నిరాశపరిచాయి. అందుకే ఆడియన్స్ సినిమా మీద హోప్స్ పెట్టుకోలేదు. పైగా డైరెక్టర్ హాలీవుడ్ వ్యక్తి. అక్కడే సగం నీరసం.
అందునా కాజల్ విష్ణుకు చెల్లిగా చేస్తోంది. అదొక విపరీతం అంటున్నారు. మరి ఇన్ని భిన్నాభిప్రాయాలు నడుమ వస్తున్న ఈ సినిమా సూపర్బ్ అనిపించుకోకపోతే నిలబడటం కష్టం. అటు ఇటుగా ఉందన్నా పోయినట్టే. ఈ విజయం విష్ణుకు చాలా ముఖ్యం. మంచు కుటుంబానికి మరీను. హిట్ అయితే పర్వాలేదు. ఒకవేళ పోయిందంటే మాత్రం ప్రక్షాళన తప్పదు. విష్ణు తన పద్ధతులన్నింటినీ మార్చాల్సి ఉంటుంది. ఆయనకు తదుపరి ఆఫర్లు వస్తాయనేది కూడ చెప్పలేం.