మంచు విష్ణు ‘జిన్నా’ ట్రైలర్ వచ్చేస్తుంది

మంచు విష్ణు హీరోగా  దర్శకుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ జిన్నా. సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ హీరోయిన్స్ గా నటిస్తున్న  ఈ మూవీ ని దసరా కానుకగా ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ కి పోటీగా రేపు రిలీజ్ చేద్దాం అనుకున్నాడు కానీ, సిజి వర్క్ పెండింగ్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేసాడు.

ఈ సినిమా మొదలైనప్పటినుండి మంచి అంచనాలు ఏర్పరిచిన జిన్నా మూవీ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచాయి. ఇక ఈ మూవీ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని అక్టోబర్ 5 న దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది.