మంచు విష్ణు జిన్నా టీజర్ వచ్చేస్తుంది

హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విష్ణు మంచు. ఎంతో భారీ వ్యయం తో రూపిండిన ‘మోసగాళ్లు’ సినిమా డిసాస్టర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘జిన్నా’ అనే సినిమాతో రాబోతున్నాడు విష్ణు.

సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ స్టోరీ, స్క్రీన్ప్లే అందిస్తున్నాడు. ఇంతకముందు ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’ సినిమాకు దర్శకత్వం వహించిన ఇషాన్ సూర్య ఈ సినిమాకి డైరెక్టర్.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సాగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియో పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం…. ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు. హారర్ కామెడీ గా వస్తున్న ఈ మూవీ అతి త్వరలో విడుదల కాబోతుంది.