Dil Ramesh: తాను ఎప్పుడూ ఎలక్షన్స్ లో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాను గానీ, ఇప్పటి వరకూ కనీసం మా ఎలక్షన్స్ నామినేషన్ పత్రాలపై కూడా సంతకం చేయలేదని, అసలు పోటీ చేయాలనే అనుకోలేదని నటుడు దిల్ రమేష్ అన్నారు. అసలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదని ఆయన తెలిపారు. కానీ వేరే వాళ్ళను పాల్గొనమని మాత్రం చెప్పే వాడినని ఆయన చెప్పారు. బయట ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయో, మా ‘ లో కూడా అలానే ఉంటాయని ఆయన అన్నారు. కొంతమంది మంచి చేయాలని చూస్తే .. మరి కొంత మంది చెడు చేయాలని భావిస్తూ ఉంటారని రమేష్ తెలిపారు.
ఇకపోతే మా ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మంచు విష్ణు గారు మా ‘ బిల్డింగ్ కట్టిస్తానని చెప్పడానికి చాలా దైర్యం ఉండాలి అని ఆయన అన్నారు. ఎంతో శ్రద్ధగా, త్రికరణ శుద్ధితో మా అసోసియేషన్ కు ఒక బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం అని ఆయన చెప్పారు. అలా చెప్పడం వాళ్లే విష్ణు ప్యానెల్ గెలిచిందని ఆయన స్పష్టం చేశారు.
ఆయన మాట ఇచ్చిన తర్వాత ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఆ బిల్డింగ్ కట్టడంలో కొంచెం ఆలస్యం అయి ఉంటుందేమో అని తాను బావిస్తున్నట్టు రమేష్ తెలిపారు. కచ్చితంగా ఆ పని ఆయన చేయాలని, లేకపోతే అది అడగడానికి తన లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని ఆయన తెలిపారు. ఎందుకంటే ఓటు వేసి గెలిపించిన వాళ్లలో తాను కూడా ఒకడిని అని ఆయన చెప్పారు.