జిన్నా అర్ధం చెప్పిన మంచు విష్ణు

చాన్నాళ్లుగా సరైన హిట్ లేని మంచు విష్ణు తన ఆశలన్నీ ఇప్పుడొస్తున్న ‘జిన్నా’ సినిమా పైనే పెట్టుకున్నాడు. దసరా కి రిలీజ్ కావలసిన సినిమా దీపావళి కి రిలీజ్ కి సిద్ధం అవుతుంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండే ఈ సినిమా చుట్టూ వివాదం నెలకొంది. అయితే కోన వెంకట్ ఈ సినిమా లో హీరో పేరు గాలి నాగేశ్వర్ రావు అని దానికి షార్ట్ కట్ గా ‘జిన్నా’ అని పేరు పెట్టుకుంటాడని చెప్పాడు.

ఇషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్నా ఈ మూవీ లో పాయల్ రాజపుట్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే మూవీ రిలీజ్ కి దగ్గర పడుతుండగా టీం అంతా కూడా మంచి ప్రమోషన్స్ ని కూడా ఇప్పుడు జరుపుతున్నారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది.

అయితే ఈ సినిమా టైటిల్ “జిన్నా” విషయంలో అసలు ఎప్పుడు నుంచో దీని అర్ధం ఏమిటి అని అంతా అనుకున్నారు. అయితే దీనిపై మంచు విష్ణు దాని అర్ధం రివీల్ చేసాడు. “జిన్నా అంటే లోడ్ చేసిన గన్ టచ్ చేస్తే దీపావళే” అంటూ మాస్ కాప్షన్ ని తాను తెలిపాడు. దీనితో అయితే జిన్నా అంటే ఏంటో తెలిసింది. అలాగే ఈ దీపావళికి కానుకగా ఈ చిత్రం ఓ పర్ఫెక్ట్ ట్రీట్ అన్నట్టు కూడా తాను ప్రమోట్ చేసుకున్నాడు.