Manchu vishnu: గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల రేట్లు వ్యవహారం కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి టికెట్ల రేట్లు గురించి పునరాలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని వినతిపత్రాలు అందిన ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై తగ్గేదే లే అంటూ మొండిగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల వ్యవహారం పై మాట్లాడటం కోసమే సినీ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలుస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గత 20 రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి మనకు తెలిసిందే.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం చిరంజీవి మీడియా ముందు మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే చిరంజీవి కలిసి వచ్చి 20 రోజులు కావస్తున్న ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు అదే విధంగా మరో వైపు పెద్ద సినిమాల విడుదల తేదీలు కూడా దగ్గరపడుతుండటంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ టికెట్ల వ్యవహారం పై మరోసారి స్పందించారు.
సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి వారు కలిసి మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, రెండు రాష్ట్రాలతో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సీఎంతో జరిగిన చర్చల గురించి వివరించినట్లు తెలిపారు. ఇక జీవో గురించి మాట్లాడిన మంచు విష్ణు రాజశేఖర్ రెడ్డి హయాంలో పెద్దగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జీవో విడుదల చేశారని ఆయన తరవాత వచ్చిన ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేశారని మంచు విష్ణు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ ఆ జీవో గురించి వివరించాలని మంచు విష్ణును ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ అది మీ పని కాదు నా పని కాదు అంటూ రిపోర్టర్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన అక్కడి నుంచి వెళ్లారు. మంచు విష్ణు సరైన పంచ్ వేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు.