Kannappa: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ఇందులో మోహన్ బాబు, శరత్ కుమార్,మోహన్ లాల్,ప్రభాస్,అక్షయ్ కుమార్,కాజల్ అగర్వాల్,బ్రహ్మానందం వంటి ఎంతోమంది స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా రకాల అప్డేట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ..
ప్రభాస్, నేనూ బావ.. బావ.. అనుకుంటాము. ఇప్పటికీ నేను తనకు ఫోన్ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఈ సినిమాలో నటించాలని నేను అడగ్గానే బావ దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా? మీరు వదిలేయండి. ఏదైనా ఉంటే నేనూ విష్ణు మాట్లాడుకుంటాం.. అని అన్నాడు. దటీజ్ ప్రభాస్. పెద్దల పట్ల తను చూపించే మర్యాద ఇలా ఉంటుంది అని అన్నారు మోహన్ బాబు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.