Manchu Manoj: సాధారణంగా వారసత్వం అనేది ప్రతి ఒక్క రంగంలోనూ కొనసాగుతూనే ఉంటుంది తల్లిదండ్రులు వైద్యరంగంలో ఉంటే పిల్లలు కూడా అదే రంగంలో కొనసాగుతుంటారు రాజకీయాలలో ఉన్నవారు తమ పిల్లలను రాజకీయాలలోకి తీసుకువస్తుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా వారి పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ వారసత్వం పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే సినీ బ్యాగ్రౌండ్ ఉన్న పిల్లలకు ఇండస్ట్రీలో రావడానికి మార్గం చాలా సులభతరం అవుతుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వారసులు కూడా సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారు కూడా ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.
తాజాగా మంచు మనోజ్ కలర్ ఫోటో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నెపోటిజం గురించి మాట్లాడారు.మనోజ్ మాట్లాడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నెగ్గుకొస్తారనే మాట నిజం కాదని, ఆ మాటకొస్తే ఆ పప్పులేం ఉడకవని, నెపో కిడ్స్ అయినా దేకాల్సిందే అంటూ తననే ఉదాహరణగా చెప్పుకున్నారు. మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్ మాత్రం ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయారు.
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే అవకాశాలు వస్తాయి ఏమో కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సినీ బ్యాగ్రౌండ్ ఏమాత్రం పనికిరాదని ఈ సందర్భంగా మనోజ్ తెలియచేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయిన చిరంజీవి రవితేజ నాని వంటి హీరోలు మంచి సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు కలర్ ఫోటో సుహాస్ సైతం ఇదే కోవలోకి వస్తారని చెప్పాలి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయిన ఈయన మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
