Manchu Lakshmi: మొదటిసారిగా తండ్రితో కలిసి నటించబోతున్న మంచు లక్ష్మి..!

Manchu Lakshmi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కుటుంబంగా ఎంతో పేరు సంపాదించుకున్న మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆయన వారసులు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే మంచు విష్ణు లక్ష్మీ ప్రసన్న మనోజ్ పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

అయితే ఇప్పటివరకు మంచు మోహన్ బాబుతో కలిసి విష్ణు మనోజ్ పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక మంచు లక్ష్మి ఇప్పటివరకు తన తండ్రితో కలిసి ఒక సినిమాలో కూడా కనిపించలేదు.ఈ క్రమంలోనే మొదటిసారిగా తన తండ్రితో కలిసి మంచు లక్ష్మి సినిమాలో నటించబోతోంది ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఇలా మొదటి సారిగా తన తండ్రితో కలిసి నటిస్తున్నానని మంచు లక్ష్మి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం పూజ కార్యక్రమం ప్రారంభించగాఈ సినిమాకి ముహుర్తపు సన్నివేశానికి ముందు మంచు మనోజ్ కెమెరా స్విచాన్ చేయగా విష్ణు కుమారుడు, లక్ష్మి కూతురు స్క్రిప్టు అందించారు. నందిని రెడ్డి దర్శకత్వం బాధ్యతలు వహించినట్లు వెల్లడించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మరి తండ్రి తనయ కలిసి మొదటిసారిగా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.