బిగ్ బాస్ పింకీతో చనువుగా మూవ్ అవుతున్న మానస్.. ఏదో తేడాగా ఉందే?

ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. బిగ్ బాస్ ద్వారా ప్రియాంక మంచి గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ప్రియాంక మానస్, జెస్సీ తో నడిపిన ట్రాకులతో బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ప్రియాంక బుల్లితెర నటుడు మానస్ తో చాలా క్లోజ్ గా ఉండేది. ఒక్కోసారి హద్దులు దాటి మానస్ మీద ముద్దుల వర్షం కూడా కురిపించేది. వీరి మధ్య ఉన్న రిలేషన్ లవ్ లేక ఫ్రెండ్షిప్ అంటూ ప్రేక్షకులకి అనుమానం వచ్చేది.

మొత్తానికి బిగ్ బాస్ ద్వారా ప్రియాంక పాపులారిటీ మరింత పెరిగిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత వీరి గురించి ఇలాంటి వార్తలు వినిపించలేదు. వీరిద్దరు అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ సోషియల్ మీడియాలో సందడి చేస్తుంటారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రియాంక , మానస్ ఇద్దరు కలిసి మన్మధుడు సినిమాలో డైలాగ్ చెప్తూ వీడియో చేశారు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్? నువ్వే కదా అందరితో సరదాగా మాట్లాడమన్నావ్.. నేను సరదాగా మాట్లాడమని చెప్పాను.. సరసాలు అడమని చెప్పలేదు. అయినా దానికి ప్యారిస్ నుండీ సెంటు తెచ్చవా? లేదూ పక్కనే ఉన్న కోటిలో కొన్నాను..అంటూ డైలాగ్ చెప్తూ వీడియో చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ నుండీ బయటికి వచ్చిన తర్వాత ప్రియాంక సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ప్రియాంక తన అందమైన ఫోటోలతో పాటు ఇలాంటి రీల్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వత ప్రియాంక తన అందం తో నెటిజన్స్ కి పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు చుసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.