ప్రస్తుత కాలంలో చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకొని విడిపోతున్నారు. ఈ క్రమంలో విడిపోయిన ఆ జంట తిరిగి వారి జీవితంలోకి మరొకరిని ఆహ్వానించి సుఖంగా బతుకుతున్నప్పటికే ఓర్చుకోలేని కొందరు వారిని అతి దారుణంగా నరికి చంపిన ఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది ఈ విషయం తెలిసిన పలువురు అయ్యో పాపం అంటూ కంటతడి పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…
హేమ మరాతీ అనే మహిళ సుఖ్ నగర్ సొసైటీలో నివాసం ఉండేది ఆమెకు అజయ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఇలా వీరిద్దరు కొన్నాళ్ల పాటు ఎంతో సంతోషంగా గడిపారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే క్రమక్రమంగా అజయ్ హేమను దూరం పెడుతూ వచ్చాడు. దీంతో భర్త ప్రేమను పొందలేకపోతున్నాననే బాధ తనలో ఉందనే విషయాన్ని మహేష్ అనే వ్యక్తి గ్రహించాడు దీంతో మహేష్ హేమకు దగ్గరయ్యాడు.ఆమె ఇష్టపూర్వకంగానే తనకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని హేమతో చెప్పాడు.
హేమ ఈ విషయం గురించి బాగా ఆలోచించి అజయ్ కన్నా అన్ని విధాలుగా మహేష్ బాగున్నాడని తనతో ఉంటే తన జీవితం సంతోషంగా ఉంటుందని భావించి ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకుని తన పిల్లలిద్దరినీ తన మొదటి భర్త దగ్గర వదిలి మహేష్ ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది.ఇలా తన కళ్ళ ఎదురుగా తన భార్య మరొకరిని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండటం చూసి ఓర్చుకోలేక పోయాడు.దీంతో స్నేహితులు కూడా తనని రెచ్చగొట్టడంతో ఏకంగా తన స్నేహితులతో కలిసి తన మొదటి భార్య చంపాలని పథకం వేశాడు. పథకం ప్రకారం హేమ పచారీ కొట్టుకు వెళ్లగా అజయ్ తన స్నేహితులు కారులో వెళ్లి ఆమెను కిరాతకంగా ఆమె వద్దని వేడుకున్నా ఆమెను దారుణంగా చంపిన ఘటన చోటు చేసుకుంది.