టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనుషుల ప్రవర్తనలో అనేక మార్పులు గమనిస్తున్నాం. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకో లేదంటే మతి భ్రమించో తెలియదు కాని వికృత చేష్టలతో వికారం వచ్చేలా చేస్తున్నారు. బట్టలు లేకుండా నడిరోడ్డుపైకి రావడం, కెమెరాలు ఉన్నాయంటే శృతిమించి వికృతంగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఆ మధ్య తనకు న్యాయం కావాలంటూ శ్రీరెడ్డి ఫిలిం చాంబర్‌లో సగం బట్టలు విప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రముఖ మోడల్-యాక్టర్ మిలింద్ సోమన్ తన 55వ బర్త్‌డే సందర్భంగా బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. ఈ దృశ్యాన్ని తన భార్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్‌లో న్యూడ్‌గా పరిగెత్తినందుకు గోవా పోలీసులు శుక్రవారం మిలింద్‌పై కేసు నమోదు చేశారు.
కరోనా వచ్చిన రోజులలో ఓ వ్యక్తి మూతికి కట్టుకోవలని మాస్క్‌ను మర్మాంగాలకు పెట్టుకొని వీధుల్లోకి వచ్చాడు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని అందరు అన్నారు. ఇక తాజాగా మరో వ్యక్తి ఒంటిపై నూలు పోగు లేకుండా తలకు పాండా మాస్క్ ధరించి నడిరోడ్డుపై రచ్చ చేశాడు. అంతటితో ఆగక స్కేటింగ్ కూడా చేస్తూ అందరు నోరెళ్ళపెట్టేలా చేశాడు. అమెరికాలోని 670 హైవే మీద కనిపించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఆ వ్యక్తిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
డిసెంబర్ 15న ఓ వ్యక్తి పాండా మాస్క్ ధరించి నగ్నంగా రోడ్డు పై ఉండడంతో డిజాన్ రేవెల్స్ అనే వ్యక్తి కారులో వెళుతూ అతడిని తన కెమెరాలో బంధించారు. ఆ వీడియో గమనిస్తే నగ్నంగా ఉన్న వ్యక్తి సెల్ఫీ స్టిక్‌తో ఫోటోలు , వీడియోలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుతంది. వీడియో మరింత అశ్లీలంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోస్ట్ చేయడం లేదని గమనించగలరు. ఏదేమైన ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టో వారికే తెలియాలి.