పాములంటే అతి కొద్ది మంది తప్పితే..మెజార్జీ జనాలకు భయం ఉంటుంది. పాము కనిపిస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. సిటీల్లో తక్కువగా కనిపించే పాములు, పల్లెలు..ముఖ్యంగా పొలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక అటవీ ప్రాంతాల్లో అయితే పాముల సంఖ్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతాల్లో తీర ప్రాంతం కావడంతో పాముల బెడద అధికంగా ఉంటుంది. ఇక పాములు పగ బట్టడాన్ని గురించి భిన్న వాదనలు ఉన్నాయి. కొంతమంది పాము పగబడితే అసలు వదలదని చెబుతారు. మరికొందరు అదంతా ఏమి ఉండదు అంతా ఫేక్ అంటారు. ఈ వాదన గురించి ఇప్పుడు కచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే. ఒకసారి..రెండుసార్లు కాదు..ఏకంగా 37 ఏళ్లుగా ఒక వ్యక్తిని పాములు కాటేస్తూనే ఉన్నాయి. అయితే ఇది ఎక్కడే జరిగిన ఘటన కాదు..మన ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది.
వివరాల్లోకి వెళ్తే…చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కురవూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే 42 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. సుబ్రమణ్యానికి భార్య, ఒక తనయుడు ఉన్నారు. అందరూ పొలం పనులు చేస్తూ..వేన్నీళ్లకు చన్నీళ్లుగా కాపురాన్ని నెట్టుకెళ్తున్నారు. ఐతే సుబ్రమణ్యంపై పాములకు ఏదో జన్మల నాటి పగ ఉన్నట్లు కనిపిస్తోంది పరిస్థితి చూస్తేందే. ఇలా ఎందుకు అంటున్నామంటే.. ఇప్పటి వరకు అతడిని 37 సార్లు పాముటు కాటువేశాయి. సుబ్రమణ్యం బడికి వెళ్లి 5వ తరగతి చదువుతున్న సమయంలో తొలిసారి పాము కాటు వేసింది. ఈ తర్వాత ప్రతి ఏటా అతడికి పాము కాటు వేయడం అలవాటుగా మారిపోయింది. ప్రతి ఏటా ఎప్పుడో ఓసారి పాములు కాటేస్తూనే ఉన్నాయి.
అలా 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యంను పాములు కాటేశాయి. అది కూడా అతడి కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు టార్గెట్ చేస్తున్నాయని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. పాము కాటువేస్తే కనీసం 10 రోజులు జాగ్రత్తలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాదు ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.10 వేల వరకు ఖర్చు అవుతోందట. కూలీ డబ్బులతో జీవనం సాగించంకునే తనకు ఇంత డబ్బు ఖర్చుచేయడం.. తలకు మించిన భారమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవలే మరోసారి అతడు మరోసారి పాముకాటుకు గురయ్యాడు. శంకరాయలపేటలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న అనతరం.. ప్రస్తుతం ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నాడు. తాము కూడబెట్టుకున్న సొమ్మంతా చికిత్సకే ఖర్చవుతుందోని.. అధికారులు తమను ఆందుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.