‘భీమ్లా’ విలన్ కి మళయాళ ముద్దుగుమ్మ దొరికేసింది .!

తెలుగు సినిమా నుంచి వస్తున్న పలు మల్టీ స్టారర్ చిత్రాల్లో మంచి మాస్ షేడ్స్ తో వస్తున్న “భీమ్లా నాయక్” సినిమా కూడా ఒకటి. మాస్ ఆఫ్ గాడ్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి సాలిడ్ విలన్ పాత్రలో ఈ సినిమా చేస్తున్నారు. మరి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ ని ఫిక్స్ చేసి మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. 
 
కానీ రానా రోల్ కి కూడా ఇంకో హీరోయిన్ ని పెట్టాల్సి ఉంది. కానీ ఆమె ఎవరు అన్నది ఎప్పుడు నుంచో సస్పెన్స్ గా ఉండగా ఇప్పుడు దానికి తెర దించింది. ఈ సినిమాలో రానాకి హీరోయిన్ గా మళయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ని ఫిక్స్ చేశారు. అంతే కాకుండా ఆమె ఆల్రెడీ షూట్ లో పాల్గొన్నట్టుగా చెప్పింది. మొత్తానికి మాత్రం మళయాళ రీమేక్ సినిమాకి మళయాళ ముద్దుగ్గుమ్మనే తెచ్చిపెట్టుకున్నారు.