మహేష్ బాబు కోసం మలయాళీ ముద్దుగుమ్మ

Hot Girl is consideration for SSMB 28
Hot Girl is consideration for SSMB 28
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగులో ఉన్న  అందరు స్టార్ హీరోయిన్లతో నటించేశాడు. కాజల్, శృతి హాసన్, సమంత, తమన్నా, పూజా హెగ్డే, రష్మిక మందన్న, కియరా అద్వానీలతో సినిమాలు చేశాడు.  ప్రస్తుతం చేస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ కథానాయికగా చేస్తోంది. ఇప్పుడు తెలుగులో ఆయనతో జోడీ కట్టడానికి హీరోయిన్ దొరకట్లేదు. ఎవరి పేరును పరిశీలించినా పాత సినిమాలే గుర్తొస్తున్నాయి. ఈ సమస్య త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు చుట్టుకుంది. పరశురామ్ సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలుపెడతాడు.  
 
ఈ సినిమాలో మహేష్ సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనేది త్రివిక్రమ్ ఆలోచన. కానీ తెలుగులో ఎవరూ దొరకట్లేదు. అందుకే తమిళం, మలయాళం వెతుకుతున్నారట.  ఈ వెతుకులాటలో ఒక హీరోయిన్ పేరును గట్టిగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమే మాళవిక మోహనన్.  ఈ మలయాళీ బ్యూటీకి మాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన ‘మాస్టర్’ చిత్రంతో తెలుగువారికి కూడ పరిచయమైంది. మహేష్ సరసన సరిగ్గా సరిపోయే స్టచర్ ఉన్న హీరోయిన్.  అందుకే ఆమె పేరును పరిశీలిస్తున్నారట. తెలుగులో ఏ హీరోయిన్ దొరక్కపోతే ఆమెనే ఫైనల్ చేస్తారని టాక్.  అదే గనుక జరిగితే తెలుగులోకి మరొక మలయాళీ ముద్దుగుమ్మ గ్రాండ్ ఎంట్రీ ఖాయం.