కరోనా పరిస్థితుల కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రంగాల్లో సినీ రంగం కూడా ఒకటి. దాదాపు రెండేళ్ళ పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సినీ పరిశ్రమకు భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. ఇక అలా టికెట్ పెంచిన ధరల తోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే.
సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల కొందరు ప్రేక్షకులకు సినిమా భారంగా మారింది అన్న చర్చ మొదలయింది. దీనితో రిపీటెడ్ ఆడియన్స్ సినిమాలకు రావడం లేదు అన్న వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమాకు టికెట్ ధరలు పెంచడం లేదని పాత టికెట్ ధరలకే సినిమాను ఎంజాయ్ చేయండి అని నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే జాబితాలోకి తాజాగా మేజర్ సినిమా కూడా చేరింది. మేజర్ సినిమాలో హీరో అడవి శేష్ ముఖ్యపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. తమ సినిమాకు కూడా టిక్కెట్ ధరలను పెంచడం లేదు అంటూ తాజాగా హీరో అడవిశేషు అధికారికంగా ప్రకటన చేశాడు.
తాజాగా ఆస్క్ శేష్ పేరుతో నిర్వహించిన సెషన్ లో ఒక అభిమాని.. సినిమా టికెట్ ధరలు తగ్గితే రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతారు ఫలితంగా ఇండస్ట్రీ కూడా కాపాడుకోవచ్చు అని సూచించారు. సదరు అభిమాని చేసిన కామెంట్స్ పై స్పందించిన అడవిశేషు మేజర్ సినిమాకు కూడా సాధారణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని.. టికెట్ల ధరలను పెంచబోము అంటూ క్లారిటీ ఇచ్చేశారు అడవి శేషు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే అడవి శేషు ముఖ్య పాత్రలో నటించిన మేజర్ సినిమాను 2008లో ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.