పాన్ ఇండియా లెవల్లో ‘వైఎస్ జగన్’ బయోపిక్

Mahi V Raghav doing YS Jagan biopic in Pan India level
Mahi V Raghav doing YS Jagan biopic in Pan India level
తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడ బయోపిక్స్ హవా బాగా పెరిగింది. ముఖ్యంగా పొలిటీషియన్స్ జీవితాల మీద సినిమాల తీయడానికి దర్శకులు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితాన్ని బయోపిక్ రూపంలో తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాన్ని ‘యాత్ర’ పేరుతో సినిమాగా తీసిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయోపిక్ తీసే పనుల్లో ఉన్నారట.  మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘యాత్ర’ చిత్రం తెలుగునాట మంచి విజయాన్ని సాధించింది.  మహి వి రాఘవ్ పేరు బాగా పాపులర్ అయింది. 
 
ఆ స్పూర్తితోనే ఆయన జగన్ బయోపిక్ తీయడానికి పూనుకున్నారు. ఇందులో హిందీ నటుడు పార్థిక్ గాంధీ జగన్ పాత్రను పోషిస్తారని టాక్.  పార్థిక్ గాంధీ ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’లో హర్షద్ మెహత పాత్రను చేసి విశేషంగా మెప్పించారు.  ఇండియా లెవల్లో మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ అనే పేరు తెచ్చుకుంది.  జగన్ పాత్రకు అతన్ని తీసుకోవడం మంచి సెలక్షన్ అనే అనాలి. ఈ చిత్రాన్ని సాదాసీదాగా తీయాలని అనుకోవట్లేదు మహి వి రాఘవ్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తారట.  తెలుగుతో పాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.  జగన్ జీవితం, పొలిటికల్ జర్నీలో అనేక కోణాలు ఉన్నాయి.  ఒక సినిమా చేయడానికి అవి చాలా చక్కగా సరిపోతాయి.  మహి వి రాఘవ్ గనుక వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే తప్పకుండా మంచి సినిమా వస్తుంది.