టీజర్ టాక్ : ప్రత్యర్థుల్ని కూడా మెప్పించేలా “యాత్ర 2” టీజర్ 

ఇది వరకే ఆల్రెడీ చాలాసార్లు చెప్పిందే ఏపీ రాజకీయాల్లో సినిమాలు రాజకీయాలు వేరు కాదు ఒకటే అని సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తుంటే రాజకీయ నాయకులు వాళ్ళ సినిమాతో తమకి మైలేజ్ పెంచుకునే పనిలో పడ్డారు. అలా ఇప్పుడు పాలిటిక్స్ రిలేటెడ్ గా వస్తున్నా మరో చిత్రమే “యాత్ర 2”.

గత సార్వత్రిక ఎన్నికలకి గాను ఏ ఎస్ ఆర్ యాత్ర ఆధారంగా సినిమా తెరకెక్కి రిలీజ్ చేస్తే ఇప్పుడు పార్ట్ 2 జగన్ యాత్ర పై దర్శకుడు మహి రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు. కాగా చాలా గ్రాండ్ గా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇప్పుడు ఆసక్తిగా ఈ సినిమా టీజర్ చూసాక అది నూటికి నూరు శాతం నిజం అని చెప్పక తప్పదు.

మెయిన్ గా దర్శకుడు ఈ టీజర్ చాలా బాగా డిజైన్ చేసాడు. రాజకీయాల్లో జగన్ పాత్రని బాగా ఎలివేట్ చేస్తూ చూపించిన విధానం జగన్ మీద కానీ ఈ సినిమా మీద ఆసక్తి లేని వాళ్ళని కూడా మెప్పించే విధంగా ఉంది. ఇంకా జగన్ పాత్రలో కనిపించిన జీవా అయితే ప్రాణం పోసాడు అలాగే టీజర్ లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇంకా బాబు, సోనియా పాత్రల్లో కూడా నటులు మెరిశారు. ఇంకా ఫైనల్ గా వై ఎస్ పాత్రలో అయితే మలయాళ నటుడు మమ్ముట్టి డైలాగ్ కూడా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇలా మొత్తంగా ఈ టీజర్ మాత్రం ఊహించని లెవెల్లో అనిపిస్తుంది. కాగా ఈ సినిమా ఈ ఫిబ్రవరి 8న అయితే గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 
Yatra2 Teaser | Mammootty | Jiiva | Mahi V Raghav | Shiva Meka | In Cinemas from Feb 8th