వై ఎస్ జగన్ పై మహేష్ బాబు నుంచి ఊహించని రేంజ్ కామెంట్స్.!

ys jagan : పాలిటిక్స్ మరియు సినిమాలు ఎప్పుడూ కలవలేవు అనేది ఎప్పుడు నుంచో ఉన్న సిద్ధాంతం.. అయితే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు కానీ సినిమా చూసి అభిమానించేస్తారు అనుకుంటే మాత్రం చాలాపెద్ద పొరపాటు అవుతుంది. అది తప్పని చాలా మంది విషయంలో కూడా ప్రూవ్ అయ్యింది.

అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అయితే జనాల్లోకి సినిమాలు రాజకీయాలు సమానంగా వెళ్తున్నాయి. ఓ హీరో ఓ రాజకీయ నాయకుని కోసం మాట్లాడితే ఎక్కడ లేని విధంగా కొత్త ఊపు అభిమానులకి వారి ఇద్దరి ఫ్యాన్స్ అయితే వచ్చేస్తుంది. ఆలాగైతే ఏపీలో ఒకింత సూపర్ స్టార్ మహేష్ బాబుకి అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి ఎక్కువే ఉన్నారని చెప్పాలి.

ఇప్పుడు అదే కిక్ ని వారు ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న అయితే ఇంటర్వ్యూ లో మహేష్ బాబు జగన్ పై కొన్ని ఊహించని కామెంట్స్ చెయ్యడం మంచి వైరల్ గా కూడా మారింది. జగన్ చాలా సింపుల్ గా ఉంటారని అప్పటివరకు చాలా సార్లు ఫోన్ లో అయితే మాట్లాడాను కానీ మొన్న మొదటి సారి కలవడం జరిగింది.

అప్పుడు ఆయన అంత సింపుల్ గా ఉంటారని అనుకోలేదని, చాలా విషయాలు అడిగి తెలుసుకొని సాయం చేస్తానని తెలిపారని మహేష్ తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ విని జగన్ మహేష్ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.