తన థియేటర్లో “RRR” తర్వాత ఆల్ టైం రికార్డు సెట్ చేసిన మహేష్ సినిమా.!

ఈ ఏడాదికి బాక్సాఫీస్ దగ్గర అటు పాన్ ఇండియా మరియు రీజనల్ గా చూసినట్టు అయితే పలు సినిమాలు భారీ వసూళ్లను అందుకొని ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. ఇక మన తెలుగు నుంచి అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రాజమౌళి ల నుంచి వచ్చిన ట్రిపుల్ ఆర్(RRR) పాన్ ఇండియా సినిమాల్లో రికార్డు గ్రాసర్ గా నిలవగా..

రీజనల్ సినిమాల్లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల తెరకెక్కించిన సర్కారు వారి పాట 200 కోట్లకి పైగా గ్రాస్ తో నిలిచింది. మరి ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన థియేటర్స్ ఏ ఎం బి సినిమాస్ లో కూడా ఆల్ టైం రికార్డులు నమోదు చేసాయాని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

మరి ఈ థియేటర్స్ లో ఈ RRR సినిమా 4.3 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డు నమోదు చేయగా రీజనల్ చిత్రాల విషయంలో అయితే మహేష్ సర్కారు వారి పాట చిత్రం 2 కోట్లకి పైగా గ్రాస్ ని ఇక్కడ వసూలు చేసింది అట. దీనితో RRR తర్వాత అధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఇది నిలిచి సత్తా చాటింది. మొత్తానికి అయితే తన థియేటర్ లో మహేష్ కి ఓ అదిరే రికార్డు నెలకొల్పింది అని చెప్పాలి.